janasena singam
Breaking
కాకినాడ సర్లంకపల్లెలో ఘోర అగ్నిప్రమాదం అరుదైన ఘనత సాధించిన ఉపముఖ్యమంత్రి పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థులు దుర్మరణం సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌షాక్‌.. పండుగ వేళ నిలిచిపోనున్న బస్సులు! చిరు – వెంకీ ఒకే స్టేజి మీద.. చిరు ముందు డ్యాన్స్ వేసిన వెంకటేష్.. పోలవరం పనులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష బంగాళాఖాతంలో అల్పపీడనం – చలి మధ్య వర్ష సూచనలు ఏపీలో మరో బస్సు ప్రమాదంప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్దం OG 2 : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి సెట్స్‌పైకి? ఫ్యాన్స్‌లో హైప్ విశాఖ ఎంపీ సీటు వైసీపీకి ఎందుకంత టెన్షన్? రాజమండ్రిలో ముగ్గుల పోటీలకు ఘనంగా తెరలేపిన ఆదిరెడ్డి శ్రీనివాసు
Logo
janasena singam
అచ్యుతాపురం ఏపీఎస్ఈజెడ్‌లో భారీ అగ్నిప్రమాదం – కఠిన చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి అనిత
అనకాపల్లి జిల్లా జనవరి 4 రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఏపీఎస్ఈజెడ్‌లోని SVS కెమికల్ ఇండస్ట్రీస్ వద్ద శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ప్రమాద స్థలాన్ని ఆమె స్వయంగా పరిశీలించి, ఘటన ఎలా జరిగిందన్న అంశంపై కంపెనీ ప్రతినిధులు, అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కంపెనీ నిర్వహణపై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. “కంపెనీలో అవసరానికి మించి ఇన్ని ట్యాంకులు ఎందుకు ఏర్పాటు చేశారు?” అంటూ ప్రశ్నించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా పాటించలేదన్న అనుమానాలు వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ఇది దురదృష్టకర ఘటన అని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకున్నారని, ఫైర్ సర్వీస్ సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ కూడా వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు హోంమంత్రి వెల్లడించారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లయితే కంపెనీ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హోంమంత్రి అనిత కఠిన వార్నింగ్ ఇచ్చారు.