janasena singam
Breaking
కాకినాడ సర్లంకపల్లెలో ఘోర అగ్నిప్రమాదం అరుదైన ఘనత సాధించిన ఉపముఖ్యమంత్రి పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థులు దుర్మరణం సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌షాక్‌.. పండుగ వేళ నిలిచిపోనున్న బస్సులు! చిరు – వెంకీ ఒకే స్టేజి మీద.. చిరు ముందు డ్యాన్స్ వేసిన వెంకటేష్.. పోలవరం పనులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష బంగాళాఖాతంలో అల్పపీడనం – చలి మధ్య వర్ష సూచనలు ఏపీలో మరో బస్సు ప్రమాదంప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్దం OG 2 : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి సెట్స్‌పైకి? ఫ్యాన్స్‌లో హైప్ విశాఖ ఎంపీ సీటు వైసీపీకి ఎందుకంత టెన్షన్? రాజమండ్రిలో ముగ్గుల పోటీలకు ఘనంగా తెరలేపిన ఆదిరెడ్డి శ్రీనివాసు
Logo
janasena singam
12 నుంచి ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సులు
ఏపీఎస్ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్.
సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పండుగకు వెళ్లే వారు పది రోజుల ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకుంటుండగా, పండుగ ముందు మూడు రోజులు, తరువాత మూడు రోజులు ప్రయాణికుల రద్దీ గరిష్ట స్థాయికి చేరుతుంది. ఇలాంటి కీలక సమయంలో **ఏపీఎస్ఆర్టీసీ**కి చెందిన అద్దె బస్సుల యజమానులు సమ్మె బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సులు నిలిపివేయాలని యజమానుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఇవాళ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. అద్దె పెంచాలని, నష్టాలు పెరుగుతున్నాయని అద్దె బస్సుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. స్త్రీశక్తి పథకం అమలుతో బస్సుల్లో అధిక రద్దీ పెరిగి, ఇంధన ఖర్చులు, నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నెలకు అదనంగా రూ.5,200 అద్దె పెంచుతూ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అది సరిపోదని యజమానుల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమతో చర్చించి అద్దె మొత్తాన్ని మరింత పెంచాలని కోరుతూ సమ్మెకు సిద్ధమయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం 2025 నాటికి ఏపీఎస్ఆర్టీసీ వద్ద మొత్తం 11,495 బస్సులు ఉండగా, అందులో 8,716 సొంత బస్సులు, 2,779 అద్దె బస్సులు ఉన్నాయి.