janasena singam
Breaking
కాకినాడ సర్లంకపల్లెలో ఘోర అగ్నిప్రమాదం అరుదైన ఘనత సాధించిన ఉపముఖ్యమంత్రి పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థులు దుర్మరణం సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌షాక్‌.. పండుగ వేళ నిలిచిపోనున్న బస్సులు! చిరు – వెంకీ ఒకే స్టేజి మీద.. చిరు ముందు డ్యాన్స్ వేసిన వెంకటేష్.. పోలవరం పనులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష బంగాళాఖాతంలో అల్పపీడనం – చలి మధ్య వర్ష సూచనలు ఏపీలో మరో బస్సు ప్రమాదంప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్దం OG 2 : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి సెట్స్‌పైకి? ఫ్యాన్స్‌లో హైప్ విశాఖ ఎంపీ సీటు వైసీపీకి ఎందుకంత టెన్షన్? రాజమండ్రిలో ముగ్గుల పోటీలకు ఘనంగా తెరలేపిన ఆదిరెడ్డి శ్రీనివాసు
Logo
janasena singam
రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలోని మీర్జాగూడా వద్ద గురువారం తెల్లవారుజామున ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది.
రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలోని మీర్జాగూడా వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. నక్షత్ర అనే విద్యార్థినికి తీవ్ర గాయాలై, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీకి చెందిన శ్రీనిఖిల్, సూర్యతేజ, సుమిత్, రోహిత్, నక్షత్రతో పాటు మరో వ్యక్తి కోకాపేటలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఓ స్నేహితుడిని డ్రాప్ చేసి నగరానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మీర్జాగూడా వద్ద కారు అతివేగంతో వెళ్లి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో శ్రీనిఖిల్, సూర్యతేజ, సుమిత్, రోహిత్‌లు మృతి చెందగా, నక్షత్రకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.