janasena singam
Breaking
కాకినాడ సర్లంకపల్లెలో ఘోర అగ్నిప్రమాదం అరుదైన ఘనత సాధించిన ఉపముఖ్యమంత్రి పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థులు దుర్మరణం సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌షాక్‌.. పండుగ వేళ నిలిచిపోనున్న బస్సులు! చిరు – వెంకీ ఒకే స్టేజి మీద.. చిరు ముందు డ్యాన్స్ వేసిన వెంకటేష్.. పోలవరం పనులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష బంగాళాఖాతంలో అల్పపీడనం – చలి మధ్య వర్ష సూచనలు ఏపీలో మరో బస్సు ప్రమాదంప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్దం OG 2 : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి సెట్స్‌పైకి? ఫ్యాన్స్‌లో హైప్ విశాఖ ఎంపీ సీటు వైసీపీకి ఎందుకంత టెన్షన్? రాజమండ్రిలో ముగ్గుల పోటీలకు ఘనంగా తెరలేపిన ఆదిరెడ్డి శ్రీనివాసు
Logo
janasena singam
స్థానికంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం ఇరుసుమండలో గల ONGC పైప్‌లైన్ నుంచి అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో భారీ మంటలు ఎగసిపడ్డాయి. లీకైన గ్యాస్ గాలిలోకి వేగంగా ఎగజిమ్మడంతో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగిన దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మలికిపురం మండల తహశీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ లీక్ అవుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం తక్షణమే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇవ్వగా, అక్కడికి చేరుకున్న ఓఎన్జీసీ టెక్నికల్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే పనిని ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.